జోర్దార్ సుజాత ప్రెగ్నెంట్... నిజమా.. కాదా?
on Apr 22, 2024
జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్ ఈ ఇద్దరి జోడి బుల్లితెర మీద సూపర్ హిట్ గా ఉంటుంది. జబర్దస్త్ లో ఐతే ఇక చెప్పక్కర్లేదు. ఒకరి మీద ఒకరు పంచులేసుకుంటూ ఉంటారు. వీళ్లది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే. రాకేష్ కెరీర్ కంటే కూడా సుజాత కెరీర్ ఫుల్ ఫార్మ్ లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సుజాత ఆటిట్యూడ్, ఆమె భాష మొత్తం కూడా కామెడీకి కెరాఫ్ అడ్రెస్స్ గా ఉంటుంది. అందుకే ఎక్కువగా వెబ్ సిరీస్ లో ఈ మధ్య కనిపిస్తోంది. అలాగే షోస్ లో కనిపిస్తోంది ఇవన్నీ పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
ఇక రీసెంట్ గా ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టింది సుజాత. "జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన" అనే సాంగ్ కి లిప్ సింక్ ఇస్తూ ఆ వీడియోలో కనిపించింది. ఐతే నెటిజన్స్ ఆమెను తెగ పొగిడేశారు. "అక్కా మీరు నైస్, మీ నటన బాగుంటుంది, నువ్వు క్యూట్ గా ఉంటావ్..." అని చెప్పారు. ఇంకొంతమంది నెటిజన్స్ మాత్రం "అక్కా నువ్వు ప్రెగ్నెంటా " అని అడిగారు.. ఐతే లాస్ట్ వీక్ జబర్దస్త్ ఎపిసోడ్ చూస్తే గనక సుజాత ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిపోతోంది. జబర్దస్త్ ప్రోమో దగ్గర కూడా చాలా మంది ఇదే విషయాన్నీ కూడా అడిగారు. ఐతే స్టేజి మీద స్కిట్ వేసేటప్పుడు ఈ విషయాన్ని ఆడియన్స్ గమనించారు. ఐతే సుజాత మాత్రం ఆ విషయానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు. అలాగే "మా ఇంటి పండగ" అంటూ రీసెంట్ గా ప్రసారమైన ఉగాది షోలో ఈ విషయం కూడా తెలిసిపోతోంది. మరి సుజాత ఈ విషయాన్ని ఎప్పుడు చెప్తుందో ,నెటిజన్స్ అనుకుంటున్నట్టు నిజమా కాదా చూడాలి. సుజాత సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో దూసుకుపోతోంది.
Also Read